మాలపల్లి: ఎన్టీఆర్ భరోసా పేదలకిచ్చిన నిజమైన భరోసా

మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి బుధవారం మాలపల్లిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పేదలకిచ్చిన నిజమైన భరోసా అని, 2025లో విజన్ ఉన్న సీఎం ఫలితాలున్న ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్‌గా నిలిచాయని, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, దీపం–2, ఎన్టీఆర్ భరోసా వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్