మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో అషాఢ చతుర్దశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు రథంపై ఊరేగారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య బంగారు రథంపై ఉత్సవమూర్తి ఊరేగటంతో భక్తులు ఘనంగా సందడి చేశారు.