మంగళవారం, మంత్రాలయం గ్రామానికి చెందిన దళిత అయ్యప్ప మృతికి తొమ్మిది రోజులు పూర్తయిన సందర్భంగా, జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అయ్యప్ప మరణం దళిత సమాజానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.