మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళవారం అర్చకులు ప్రహ్లాద మూర్తికి పాదపూజ నిర్వహించారు. ఉంజల్ మంటపంలో సేవాకర్తల పేర్లపై సామూహిక సంకల్పాలు చేశారు. అనంతరం ఉత్సవ రాయల పాదపూజ, సర్వసేవ, తులసి అర్చనలు చేశారు. మృతిక బృందావనాన్ని వెండి ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుపుగా మూల బృందావనానికి అభిషేకాలు చేసి మంగళ హారతులు సమర్పించారు. కార్యక్రమంలో సహాయ పీఆర్ఓ వ్యాసరాజస్వామి పాల్గొన్నారు.