మంత్రాలయం: రాఘవేంద్రస్వామి దర్శనానికి లక్షలాది భక్తులు

నూతన సంవత్సరం సందర్భంగా, గురువారం దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు మంత్రాలయానికి తరలివచ్చి రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, రాఘవేంద్ర సర్కిల్‌, నదితీరం భక్తులతో కోలాహలంగా మారాయి. స్వామి మూల బృందావనంలో ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చడంతో దర్శనం, పరిమళ ప్రసాదం క్యూలైన్లు పొడిగించారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేయించారు. రద్దీ కారణంగా ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్