మంత్రాలయం పట్టణంలోని రామచంద్రనగర్‌కు చెందిన మోహన్, తన భార్య స్నేహ కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై శుక్రవారం సెల్ టవర్ ఎక్కి ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకుని, మోహన్ భార్యను తీసుకుని రావడంతో అతన్ని కిందకు దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోహన్ గతంలో కూడా ఇలాగే ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డాడు. మోహన్‌కి భార్యతో పాటు ఏడాది వయసున్న కుమార్తె కూడా ఉంది.