ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠానికి 22 రోజుల హుండీ ఆదాయం రూ. 4,35,25,136 వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్. కే. శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం హుండీ లెక్కింపులో కరెన్సీ రూపంలో రూ. 4,19,97,861, నాణేల రూపంలో రూ. 15,27,275 లభించినట్లు వెల్లడించారు. భక్తులు 46 గ్రాముల 100 మిల్లీగ్రాముల బంగారం, 750 గ్రాముల 600 మిల్లీగ్రాముల వెండి కూడా సమర్పించారు. హుండీ లెక్కింపు సమయంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.