కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తుల గల్లంతైన విషయం తెల్సిందే. వారి మృతదేహాలను ఆదివారం ఉదయం నుంచి గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, రెస్క్యూ బృందంతో కలిసి గాలించి మృతదేహాలు బయటకు తీశారు. మృతులు కర్ణాటక హసన్ కు చెందిన ప్రమోద్, అజిత్, సచిన్ గా గుర్తించారు. ఈ ఘటనతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.