మంత్రాలయం: 2029లో నారా లోకేష్ సీఎంగా బాధ్యతలు చేపడతారు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం మంత్రాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు మండలాల్లోనూ మండల అధ్యక్షులు, గ్రామ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలపై చర్చించిన నాయకులు, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, 2029లో కూటమి తరఫున నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్