మంత్రాలయం: రౌడీ రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారు: కృష్ణమ్మ

మంత్రాలయం టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, నియోజకవర్గ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, అల్లర్లు సృష్టించడం, గొడవలు పెట్టడం వైఎస్సార్‌సీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. తమ ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో కొందరు బైక్‌లపై వచ్చి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం, పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం ఖండనీయమని అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని, ఎలాంటి ప్రేరేపణలకు లోనుకావద్దని సూచించారు. ప్రజల ఆశీర్వాదాలతో 44 ఏళ్లుగా టీడీపీ ముందుకు సాగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్