కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో గురువారం కిటకిటలాడుతుంది. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ముందుగా మంచాలమ్మను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అన్నపూర్ణ భోజనశాల, ఆలయ ముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహలంగా మారాయి.