మంత్రాలయం: తుంగభద్రలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కర్నూలుకు చెందిన సతీశ్‌ (35), అతని కుమారుడు యువన్ చంద్ర (5), మంత్రాలయానికి చెందిన ధనుశ్‌ (23) మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మరో ఇద్దరు రాఘవేంద్ర (25), సంధ్య (22) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్