కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన కర్ణాటకకు చెందిన 7 మంది యువకులు శనివారం పుణ్యస్నానాలు చేయడానికి తుంగభద్ర నదిలోకి వెళ్లి, ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. హేమంత్, నారాయణ, రంగనాథ్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన వీఐపీ స్నానఘట్టం సమీపంలో జరిగింది. గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ముగ్గురు యువకుల ఆచూకీ ఇంకా లభించలేదని ఎస్సై శివాంజల్ తెలిపారు.