మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ముగ్గురు యువకులు శనివారం గల్లంతయ్యారు. కర్ణాటకకు చెందిన అజిత్ (19), ప్రమోద్ (20), సచిన్ (20) నదిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. వీరంతా మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.