మంత్రాలయం: ఆత్మహత్య చేసుకున్న మహిళ

మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామానికి చెందిన లక్ష్మీ బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివాంజల్ తెలిపారు. గతేడాది జరిగిన ప్రమాదంలో ఆమె తలకు గాయం కాగా చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. అయితే పదేపదే తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. లక్ష్మీ సోదరుడు గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్