మంత్రాలయం నియోజకవర్గ స్థాయి సియం కప్ పోటీలు కోసిగి మండలం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 30న అనగా గురువారం ఉదయం పది గంటలకు స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు ప్రారంభిస్తారు. అనంతరం పదకొండు గంటలకు యంపిడిఓ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన జగనన్న శాశ్వత గృహహక్కు పథకానికి ఓటియస్ ద్వారా డబ్బులు చెల్లించిన లబ్దిదారులకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేతుల మీదుగా జగనన్న శాశ్వత గృహహక్కు పథకం ద్వారా రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమన్నికి వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.