మంత్రాలయం మండలంలోని మాలపల్లిలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భ్రమరాంబ మొబైల్ షాపు దగ్ధమైంది. దాదాపు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లిందని దుకాణం యజమాని బోయ ముత్తురెడ్డి తెలిపారు. దుకాణంలో ఉన్న సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సెల్‌ఫోన్ల అమ్మకం, సర్వీసింగ్ ద్వారా జీవనం సాగిస్తున్న బాధితుడు ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయినట్లు వాపోయాడు.