పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందజేస్తున్నారని, ఇది అవ్వాతాతలకు వరంలాంటిదని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు భరోసా లభిస్తోందని వారు తెలిపారు.