పెద్దకడబూరు: భారీ వర్షంతో జలమయమైన కాలనీలు

కర్నూలు జిల్లాలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పలు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెద్దకడబూరులోని 5వ వార్డులో సీసీ రహదారులు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీనివల్ల బియ్యం, ధాన్యం, బట్టలు వంటి సామగ్రి తడిసిపోయాయి. స్థానికులు ప్రతీ ఏటా ఇదే సమస్య ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్