రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవరమాకంతరెడ్డి బుధవారం పెద్దకడబూరు రైతు సేవకేంద్రంలో మాట్లాడుతూ, రైతులు ఒకే పంటకు పరిమితం కాకుండా డిమాండ్ ఉన్న పంటలు వేయాలని, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. వ్యవసాయంలో డ్రోన్లు, స్ప్రింకర్ల వంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ మద్దతు ధర, పాడిపంటలకు అండ, బ్యాంకులు–సొసైటీల రుణాలు రైతుకు బలమని తెలిపారు.