పెద్దకడబూరు: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

పెద్దకడబూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి, తుంగభద్ర డిప్యూటీ చైర్మన్ నరవ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం ఆయన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్