పెద్దకడబూరు: జనసేన బలోపేతానికి గ్రామగ్రామాన పనిచేయాలి

మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి గ్రామగ్రామాన పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మన్న పిలుపునిచ్చారు. బుధవారం పెద్దకడబూరు మండలంలో ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన నాయకులకు సూచించారు.

సంబంధిత పోస్ట్