ఆదోనిలో జిల్లా హోదా డిమాండ్‌తో పాటు, తమ గ్రామాలను పెద్దహరివనం మండలంలో చేర్చవద్దని కోరుతూ 16 గ్రామాల ప్రజలు సోమవారం భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. వేలాది మంది ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, పెద్దహరివనం మండలం ఏర్పాటు ప్రజల ఆమోదం లేకుండా సాధ్యం కాదని స్పష్టం చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.