వైసీపీ నాయకుడిని పరామర్శించిన ప్రదీప్ రెడ్డి

పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బోయ కడబూరి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, గురువారం బోయ కడబూరిని పరామర్శించి, ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కేపీ యల్లప్ప కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్