మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి బుధవారం పులికనుమ సాగునీటి ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. చంద్రబాబు నాయుడు పాలనలో సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చి రూ. 8 వేల కోట్లు ఖర్చు చేశారని, హంద్రి–నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరు అందించామని తెలిపారు. వైసీపీ పాలనలో 102 ప్రాజెక్టులు రద్దయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.