మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్రా రెడ్డి ఆదేశాల మేరకు గురువారం మంచాల సొసైటీ చైర్మన్‌గా ఎన్. రామకృష్ణ రెడ్డి, కల్లూదేవకుంట చైర్మన్‌గా రాఘమ్మా బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి చేసి రైతులకు సహాయం చేస్తామన్నారు. అనంతరం రాఘమ్మా మాట్లాడుతూ యూరియా సమస్యపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదని తెలిపారు.