నదిచాగిలో షార్ట్ సర్క్యూట్‌తో రూ. 6 లక్షల గడ్డివాములు దగ్ధం

కౌతాళం మండలం నదిచాగిలో బుధవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా గడ్డి వాములు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 6 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. గ్రామానికి చెందిన అల్లాబకష్, జాఫరాబ్, మైనూద్దీన్ సాహెబ్లకు చెందిన నాలుగు గడ్డి వాములు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గడ్డి వాములు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి. మైనూద్దీన్‌కు చెందిన రెండు గడ్డి వాములు, అల్లాబకష్, జాఫరాబ్‌లకు చెందిన ఒక్కో గడ్డివాము పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఆదోని అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం సంభవించింది.

సంబంధిత పోస్ట్