తాళం వేసిన ఇంట్లో చోరీ: రూ.1.97 లక్షల నగలు అపహరణ

పెద్దకడబురు మండలం హనుమాపురంలో కూలీ మోకాసీ వీరేష్ ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి సుమారు రూ.1,97,500 విలువైన 12 గ్రాముల బంగారు నెక్లెస్, 10 గ్రాముల బంగారు టిక్కా, 5 గ్రాముల బంగారు కమ్మలు, 20 తులాల వెండి కడియాలు, 12 తులాల వెండి గొలుసులు, 15 తులాల వెండి కాళ్ల పట్టీలు దొంగిలించారు. బాధితుడు వీరేష్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై మారుతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్