మంత్రాలయం: తుంగభద్రలో ముగ్గురు యువకుల గల్లంతు

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం హసన్‌ నుంచి వచ్చిన ఏడుగురు భక్తుల్లో ముగ్గురు యువకులు శనివారం తుంగభద్ర నదిలో పుణ్యస్నానం సమయంలో గల్లంతయ్యారు. వారు అజిత్ (19), సచిన్ (19), ప్రమోద్ (19)గా గుర్తించారు. సర్పంచ్ భీమయ్య గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా, మఠం అధికారులు, పోలీస్‌లు ఘటన స్థలానికి చేరుకుని సమీక్షించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వై. సీతారామిరెడ్డి ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్