మంత్రాలయం మండలంలో ఇద్దరు అదృశ్యం

మంత్రాలయం మండలంలోని చిలకలడోణ గ్రామానికి చెందిన బోయ తాయమ్మ, ఆమె కుమారుడు సాయి మిస్సింగ్ అయ్యారు. గురువారం ఎస్సై శివాంజల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 30న ఇంటి నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలించినా వారి జాడ తేలలేదు. దీంతో మంత్రాలయం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై శివాంజల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్