బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం శివారులోని మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రంలో జరిగిన తలనీలాల బహిరంగ వేలం రూ. 2.03 కోట్లకు ముగిసింది. ఏడాది పాటు భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ హక్కును కడప జిల్లా మైదుకూరుకు చెందిన సంజయ్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 2,03,94,000కు దక్కించుకుంది. దేవదాయ శాఖ పర్యవేక్షణలో ఈ వేలం నిర్వహించినట్లు ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు.