డోన్ పట్టణంలోని కొండపేట వీధిలో ఆటో డ్రైవర్ జగన్ గోపాల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.