నంద్యాలలో మహిళలకు చట్టాలపై అవగాహన, శక్తి యాప్ డౌన్‌లోడ్

నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్ వెంకటేశ్వర్లు, సిబ్బంది నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలోని మహిళలకు బుధవారం మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, సైబర్ నేరాలు జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు. బాల్యవివాహాలు జరిగినచో 1098కు కాల్ చేసి తెలియజేయాలని తెలిపారు. అక్కడి మహిళలకు సెల్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.

సంబంధిత పోస్ట్