నంద్యాల శ్రీనివాస్ సెంటర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనపై సమగ్ర విచారణ జరిపి, అసలు నిందితులు మరియు కుట్రదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కోట్లాది మంది వైఎస్సార్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా నిజానిజాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.