రైతన్న నీకోసం పేరుతో కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని సీపీఎం నాయకులు తీవ్రంగా విమర్శించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నాగేశ్వరరావు, నాయకులు పక్కిరి సాహెబ్, గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. రైతుల సమస్యలు పెరిగిపోతున్నా పరిష్కారంపై చర్యలు కనిపించడం లేదని మండిపడ్డారు.