సంగమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

వేల ఏళ్ల చరిత్ర కలిగిన సప్త నదుల సంగమేశ్వర ఆలయం, పచ్చటి ప్రకృతి మధ్య ఆహ్లాదకరంగా దర్శనమిస్తోంది. ఏడాదిలో 8 నెలలు నీటిలో మునిగి ఉండే ఈ ఆలయం, కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడి వేప శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయం నీటి నుంచి బయటపడటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్