నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో మంగళవారం రూ. 4.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు నంద్యాల టిడిపి పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు. వెంకట్ లక్ష్మికి రూ. 3.5 లక్షలు, సరస్వతికి రూ. 55 వేలు, చెట్ల జయన్నకు రూ. 25,743 చొప్పున మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వైద్య సహాయం అందిస్తోందని, అర్హులైన కుటుంబాలు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.