కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆశ చూపించి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో సంక్షేమంపై పెద్ద హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయలేదన్నారు. నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ, ప్రజలు నమ్మి మోసపోవడం ఇదే మొదటిసారి కాదని వ్యాఖ్యానించారు.