నంద్యాలలో ఫింగర్ ప్రింట్ ఎస్సైగా పనిచేస్తున్న ఇండ్ల భరత్ కుమార్‌పై ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. 2025లో వివాహం చేసుకున్న భార్య ప్రియాంకను అదనపు కట్నం కోసం వేధించి, కాపురానికి తీసుకెళ్లలేదని ఆరోపణలున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.