నందికొట్కూరులో నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం

నందికొట్కూరులోని బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో మంగళవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు విద్యార్థులకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయని, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విద్యార్థులకు గుర్తు చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత మత్తు వ్యసనాలపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జఫరుల్లా, ఎక్సైజ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్