నంద్యాల ఫరూక్ నగర్‌లోని క్లాసిక్ బిర్యానీ హౌస్‌లో చికెన్ రోస్ట్‌లో బొద్దింక కనిపించిందనే వార్త వైరల్ కావడంతో, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వంటగదిని పరిశీలించి, లోపాలను సరిదిద్దాలని యాజమాన్యానికి 15 రోజుల గడువుతో ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేశారు. బిర్యానీ నమూనాలను సేకరించి పరీక్షల కోసం చెన్నై ప్రయోగశాలకు పంపారు. నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.