నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం వీపనగండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బుధvaram కురిసింది. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడటంతో ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఈ నేపథ్యంలో, చెట్ల కింద, సెల్‌ఫోన్ టవర్ల సమీపంలో, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.