నంద్యాల రాయల్ ఫంక్షన్ హాల్‌లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. 28 మంది సభ్యుల బృందం పార్టీ నాయకులు, జనసైనికుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఎంపికైన వివరాలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.