కొత్తపల్లె మండలం నందికుంటలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా ఈ పనులకు శ్రీకారం చుట్టారు. నీటి నాణ్యతను మెరుగుపరచడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు.