సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లె మండలం నందికుంటలో ఆదివారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటించారు. ఎన్నికల హామీ మేరకు పింఛన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. మహిళలకు దీపం పథకం కింద సంవత్సరం పాటు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నట్లు గుర్తు చేశారు. టీడీపీ నేతలు ఆయనతో కలిసి పాల్గొన్నారు.