రైతన్నా–మీకోసం’ అవగాహన సదస్సలో ఎంపీ బైరెడ్డి శబరి

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం నందికొట్కూరులో జరిగిన ‘రైతన్నా–మీకోసం’ అవగాహన సదస్సులో మాట్లాడుతూ, ఉమ్మడి ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ చర్యలను వివరించారు. డ్రోన్ టెక్నాలజీ, మెకనైజేషన్, ప్రకృతి వ్యవసాయం, ఆధునిక అగ్రిటెక్ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్‌, పెట్టుబడి సాయం వంటి ప్రయోజనాలను రైతులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని ఆమె తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మారేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎంపీ చెప్పారు.

సంబంధిత పోస్ట్