నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలం నాగలూటీ గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే గిత్త జయసూర్య లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని పింఛన్లు అందజేశారు. ప్రజా సమస్యలపై అభిప్రాయాలు సేకరించిన ఆయన, కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.