కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఈడీ దాడులను నిరసిస్తూ సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. నాగేశ్వరావు నందికొట్కూరులో ఆందోళన నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయడం అమానుషమని ఆయన పేర్కొన్నారు.