నందికొట్కూరు: శాతనికోటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

నందికొట్కూరు మండలం శాతనికోట గ్రామంలో శనివారం ‘పేదల సేవలో – ఎన్టీఆర్ భరోసా పెన్షన్’ కార్యక్రమం జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు, మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్