నందికొట్కూరు: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో సుపరిపాలనలో అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్